మగబిడ్డకు జన్మనిచ్చిన నటి అనిత..!

నటి అనితి హసానందాని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త రోహిత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా, ‘నువ్వు-నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల చెరగని ముద్ర వేసిన అనితకు ఆ తర్వాత అవకాశాలు రాలేదు. దీంతో ఆమె హిందీ బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. పలు సీరియళ్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అనిత 2013లో బిజినెస్ మెన్ రోహిత్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఏడేళ్ల తర్వాత మంగళవారం తొలి సంతానానికి జన్మనిచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత తమ జీవితాల్లోకి చిన్నారి రావడంతో ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. ఈక్రమంలో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

 

 

View this post on Instagram

 

A post shared by Rohit Reddy (@rohitreddygoa)

Leave a Comment