‘బేబీ..కొద్ది సేపు ఆగు’.. ఫస్ట్ నైట్ రోజు కంప్యూటర్ తో వరుడు కుస్తీ..!

కరోనా లాక్ డౌన్ నుంచి చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఎలానో ఇంట్లోనే ఉంటున్నాం కదా అని.. కొంత మంది అయితే సెలవులు కూడా పెట్టుకోవడం లేదు. తాజా ఓ ఫొటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఓ వరుడు తన మొదటి రాత్రి రోజే కంప్యూటర్ తో కుస్తీ పడుతున్నాడు. 

శోభనానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉండి.. పెళ్లి కొడుకు కోసం ఆ వధువు ఎదురుచూస్తుంటే అతడు మాత్రం కంప్యూటర్ లో మునిగితేలుతున్నాడు. వివాహ దుస్తులతో కంప్యూటర్ ముందు కూర్చుని ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై ట్విట్టర్ లో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. 

ఈ ఫొటోను ‘హోల్డ్ ఆన్ బేబీ’ గా నెటిజన్లు పిలుస్తూ ఒక్కొక్కరు ఒక్కో క్యాప్షన్ ఇస్తున్నారు. ‘బేబీ కొద్ది సేపు ఆగు.. ముందు నన్ను ట్విట్టర్ నోటిఫికేషన్స్ చెక్ చేసుకోనివ్వు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఫొటో మాత్రం ఎక్కడి నుంచి వచ్చిదో తెలియరాలేదు. 

You might also like
Leave A Reply

Your email address will not be published.