కత్తి మహేష్ మృతి..!

సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ మరణించారు. గత నెల 26న నెల్లూరు దగ్గర ఆయన రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నమూశారు. దాదాపు 14 రోజులుగా ఆయన హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. త్వరలోనే ఆరోగ్యం కుదుటపడుతుందనుకున్న ఆయన ఆరోగ్యం విషమించి శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో తుదిశ్వాస విడిచారు. 

కత్తి మహేష్ మృతితో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. గతనెల 26న తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు నెల్లూరు జిల్లా కొడవలూరు హైవే వద్ద లారీని ఢికొట్టడంతో కత్తి మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.17 లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించిన విషయం తెలిసిందే… 

Leave a Comment