యూపీలో కొత్త జనాభా విధానం ప్రకటించిన యూపీ సీఎం యోగీ..!

జనాభా నియంత్రణకు యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం ప్రపంచ జనాభా దినోత్సం సందర్భంగా యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2021-2030 కిగాను కొత్త జనాభా విధానాన్ని ప్రకటించారు. ప్రస్తుతం 2.7గా ఉన్న జననాల రేటును 2026లోపు వెయ్యికి 2.1, 2013లోపు 1.9కి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

రాష్ట్రంలో జనాభా నియంత్రించాలంటే కచ్చితంగా ఇద్దరు పిల్లల మధ్య ఎడం పెంచాలని సీఎం యోగీ స్పష్టం చేశారు. పెరిగిపోతున్న జనాభా రాష్ట్ర, దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని, పేదరికానికి జనాభా పెరుగుదల కూడా కారణమని ఆయన వెల్లడించారు. కొత్త జనాభా విధానం 2021-2030లో ప్రతి కమ్యూనిటీని పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు.  

జనాభా నియంత్రణ విధానం ప్రకారం:

  • ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుండదు. 
  • ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా వారిని అనర్హులుగా పరిగణిస్తారు. ఒకవేళ ఇప్పటికే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రమోషన్లు ఇవ్వరు.
  • కుటుంబంలో ఎంత మంది ఉన్నా రేషన్ కార్డులో నలుగురు వ్యక్తులు మాత్రమే ఉండేలా ప్రతిపాదనలు చేశారు. 
  • ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్న వారికి ఎలాంటి ప్రభుత్వ సబ్సిడీ పథకాలు కూడా అందవు..

ఇద్దరు ఉంటే ప్రోత్సాహకాలు:

ఇద్దరు పిల్లల నిబంధనల పాటించే వారికి ప్రోత్సాహకాలు కూడా అందించనున్నారు. ఇద్దరు సంతానం పాటించే ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసు మొత్తంలో రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నారు. ఇల్లు లేదా ప్లాట్ కొనాలనుకుంటే సబ్సిడీ అందించనున్నారు. ఇక, ఒక్కరే సంతానం ఉన్న వారికి మరిన్ని సదుపాయాలు లభించనున్నాయి. వీరికి సర్వీసులో 4 అదనపు ఇంక్రిమెంట్లతో పాటు చిన్నారికి 20 ఏళ్లు వచ్చే వరకు ఆరోగ్య సేవలు, విద్య ఉచితంగా అందించనున్నారు.

Leave a Comment