నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత..!

టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. కరోనాతో షూటింగులు లేకపోవడంతో లాక్ డౌన్ నుంచి గుంటూరులోనే ఉంటున్న ఆయన..గుండెపోటుతో బాత్ రూమ్ లో కుప్పకూలి తుదిశ్వాస విడిచారు. రాయలసీమ మాండలికంలో విలనిజాన్ని అద్భుతంగా పండించారు. విలన్ గా, కమెడియన్ గా ప్రేక్షకులను అలరించారు. 

జయప్రకాశ్ రెడ్డిి 1946 మే 8న జన్మించారు. 1988లో ‘బ్రహ్మపుత్రుడు’ సినిమా ద్వరా ఇండస్ట్రీకి పరిచమయ్యారు. ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, జయం మనదేరా, చెన్నకేశవరెడ్డి, సీతయ్య, ఛత్రపతి, గబ్బర్ సింగ్, నాయక్, రేసుగుర్రం, మనం, టెంపర్, సరైనోడు వంటి హిట్ చిత్రాల్లో జయప్రకాశ్ రెడ్డి నటించారు. జయప్రకాశ్ రెడ్డి మరణం పట్ట సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు. 

Leave a Comment