పబ్జీకి ఏడుస్తూ పాడేమోసిన యువత.. ఫన్నీ వీడియో

భారత ప్రభుత్వం పబ్జీతో సహా 118 చైనా యాప్ లను ఇటీవల బ్యాన్ చేసింది. అయితే పబ్జీ బ్యాన్ చేయడంతో చాలా మంది యువత జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే పబ్జీ గేమ్ కు ఉన్నా క్రేజ్ అలాంటిది మరి..పబ్జీకి అలవాటు పడిన యువత రకరకాలుగా దానిపై ప్రేమను చూపుతున్నారు. తాజాగా గుజరాత్ లో కొంత మంది యువత పబ్జీ యాప్ కు అంత్యక్రియలు నిర్వహించారు. పబ్జీ యాప్ కు పాడేమోస్తూ రోధిస్తూ నివాళులర్పించారు. 

20 మంది స్నేహితులు కలిసి గత ఏడునెలలుగా పబ్జీ ఆడేవాళ్లమని, పబ్జీని బ్యాన్ చేయడంతో విస్మయానికి గురయ్యామని వారిలో రోషన్ పటేల్ అనే వ్యక్తి చెప్పారు. పబ్జీని బ్యాన్ చేసినందుకు తామంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నామని, అందుకే అంత్యక్రియలు చేశామని తెలిపాడు. కాగా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎన్ కోర్ అనే సంస్థతో కలిసి పబ్జీ లాంటి గేమ్ ను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. భారత ప్రభుత్వ నిర్ణయానికి పూర్తి మద్దతు తెలిపాడు. 

Leave a Comment