వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని.. బాయ్ ఫ్రెండ్ పై యాసిడ్ దాడి..

తన బాయ్ ఫ్రెండ్ పై ఓ యువతి యాసిడ్ దాడి చేసింది. ఈ దాడిలో ప్రియుడు మరణించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని హరిపర్వత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల మేరకు దేవేంద్ర రాజ్ పుత్(28), సోనమ్ ఇద్దరు ఓ ప్రైవేట్ ల్యాబ్ లో పనిచేస్తూ ప్రేమించుకున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఓ అద్దె ఇలు తీసుకుని ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. 

అయితే దేవేంద్ర తల్లిదండ్రులు అతడికి మరో యువతితో పెళ్లి ఫిక్స్ చేశారు. తన ప్రియుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి సోనమ్ ఆగ్రహానికి గురైంది. ఓ రోజు సీలింగ్ ఫ్యాన్ రిపేర్ చేయాలంటూ ప్రియుడు దేవేంద్రను ఇంటికి పిలిచింది. కోపంతో ఉన్న సోనమ్ ప్రియుడు రాగానే అతనిపై యాసిడ్ పోసింది.

ఈ దాడిలో దేవేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. శరీరం కాలడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆ దేవేంద్ర ప్రాణాలు కోల్పోయాడు. సోనమ్ కు కూడా స్వల్పంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. సోనమ్ తమ కుమారుడిపై యాసిడ్ దాడి చేసి చంపేసిందని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Leave a Comment