రామ్ చరణ్ బర్త్ డే.. చిరు స్పెషల్ విషెస్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శనివారం 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్ పెట్టి విషెస్ తెలిపారు. చరణ్ తనకు అండగా ఉన్నాడనే ఉద్దేశంతో.. చిన్నప్పటి నుంచీ తనకు గొడుగు పడుతూ ఉన్న ఫొటోలను వీడియో రూపంలో షేర్ చేశారు. చరణ్ పెద్దవాడయిన తర్వాత చిరుకు గొడుకు పడుతున్న ఫొటోని అప్పుడు, ‘ఆచార్య’ సెట్స్ లో చిరుకు గొడుకు పడుతున్న ఫొటోని చూపిస్తూ ఎల్లప్పుడు అంటూ తన ప్రేమను చాటుకున్నారు. ‘హి ఈజ్ కేరింగ్ సన్’ అంటూ చిరు ఎమోషనల్ గా చెర్రికి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా బానం విసురుతున్న చెర్రి లుక్ ను తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ‘ధైర్యవంతుడు, నిజాయితీపరుడు, నీతిమంతుడు, అతడే నా సోదరుడు రామ్ చరణ్’ అంటూ విష్ చేశాడు. అలాగే హీరోయిన్ సమంత, అల్లు అర్జున్, పూజా హెగ్డే, యాంకర్ అనసూయతో పాటు పలువురు చెర్రికి బర్త్ డే విషెస్ తెలిపారు.  

 

Leave a Comment