‘హోం మంత్రిని అవుతా.. తాటతీస్తా’.. పోలీసులతో అచ్చెన్నాయుడు..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వేడిని పెంచుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తిని అచ్చెన్నాయుడు బెదిరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రావడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. తర్వాత ఆయన్ను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించి, ఆ తరువాత కోర్టుకు తీసుకెళ్లారు. 

అయితే అచ్చెన్నాయుడు మాత్రం తనను పోలీసులు అరెస్టు చేసిన తీరుపై మండిపడ్డారు. పోలీసుల చర్యలను ఆయన ఖండించారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే తానే హోం మంత్రి అవుతానని, చంద్రబాబును ఒప్పించి హొంమంత్రి పదవిని తీసుకుంటానని చెప్పారు. అప్పుడు తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదన్నారు. 

తాను నాయకులను తప్పుపట్టడం లేదని, పోలీసుల తీరును తప్పుపడుతున్నానని అచ్చెన్నాయుడు తెలిపారు. డీఎస్పీ, సీఐలు తన బెడ్ రూంలోకి వచ్చారన్నారు. నోటీసులు ఇస్తే తానే వచ్చేవాడినని అన్నారు. ఖాకీ డ్రస్సు అంటేనే విరక్తి కలుగుతోందని, పోలీసులను చూసి ఉద్యోగులు సిగ్గు పడుతున్నారని పేర్కొన్నారు. 

 

Leave a Comment