రైతులతో యుద్ధానికి సిద్ధమైన పోలీసులు?

దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. కాగా రిపబ్లిక్ డే రోజున ఢిల్లీోలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రహదారుల దిగ్భందానికి సిద్ధమైన రైతు ఉద్యమకారులను నిలువరించేందుకు ఢిల్లీ పోెలీసులు సిద్ధమవుతున్నారు. 

ఢిల్లీ సరిహద్దుల్లో మేకులు, పెద్ద ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. అంతే కాదు రహదారి మధ్యలో కాంక్రీట్ పోతపోసి అందులో పదునైన ఇనుమ మేకులను అమర్చారు. ఇక పోలీసులు అయితే తమ చేతివేళ్లకు రక్షణగా ఉండేందుకు ఓ స్టీల్ తొడుగును, మరో చేతికి డాలును పోలిన తొడుగును ధరించారు. అంతేకాడు సింగూ సరిహద్దులోని ప్రధాన రహదారి వద్ద రెండు వరుసల ఇనుప రాడ్లను పాతడంతోపాటు, తాత్కాలికంగా గోడను నిర్మిస్తున్నారు. 

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ‘గోడలను కాదు.. బ్రిడ్జీలను నిర్మించండి’ అంటూ బీజేపీ ప్రభుత్వంపై ట్వీట్టర్ లో విమర్శించారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను కూడా ఆయన జత చేశారు. 

Leave a Comment