ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ.. 2024 ఎన్నికలే టార్గెట్..!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా? అంటే.. సోమవారం ఆయన చేసిన ఓ ట్వీట్ అవుననే సమాధానం చెబుతోంది.. 2024 సార్వత్రిక ఎన్నికలపై చేసే కమిటీలో సభ్యుడిగా రావాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను ప్రశాంత్ కిశోర్ తిరస్కరించిన సంగతి తెలిసిందే.. 

2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ లో చేరి పార్టీని బలోపేతం చేస్తారన్న ఊహాగానల నేపథ్యంలో.. ఆ పార్టీలో చేరడం లేదని గతవారం ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది.. ఈక్రమంలో సోమవారం ఆయన చేసిన ట్వీట్ లో కొత్త పార్టీ పెడుతున్నట్లు హింట్ ఇచ్చారు..

ఆయన ఏం ట్వీట్ చేశారంటే.. ‘ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామై, ప్రజానుకూల విధానాల రూపకల్పనలో సాయం చేయడంలో 10 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు నేరుగా ప్రజల వద్దకు చేరుకోవాల్సిన సమయం వచ్చింది. వారి సమస్యలను మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, జనసురాజ్ కు బాటలు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆరంభం బిహార్ నుంచే’.. అంటూ ప్రశాంక్ కిశోర్ ట్వీట్ చేశారు. 

అయితే ఆ ట్వీట్ తో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్లు స్పష్టం చేసినట్లే.. అయితే ఆయన కొత్తగా పార్టీ పెడతారా? ఏదైనా దిగ్గజ పార్టీలో చేరి తన అజెండాను ముందుకు తీసుకెళ్తారా అనే దానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రశాంత్ కిశోర్ గతంలో నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతా దళ్ – యునైటెడ్ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 

 

Leave a Comment