డెడ్ లైన్ మిస్సయితే రూ.10 వేలు జరిమానా

ఆధార్ – పాన్ లింక్ పై ఆదాయ పన్ను శాఖ నిర్ణయం

ఆధార్ తో పాన్ అనుసంధానానికి ఆదాయ పన్ను శాఖా తాజా డెడ్ లైన్ మార్చ 31ని మిస్ అయితే పాన్ కార్డుదారులకు భారీ షాక్ తప్పదు. ఈ గడువులోగా ఆధార్-పాన్ లింకేజీ పూర్తి చేయడంలో విఫలమైతే పాన్ కార్డు పనిచేయకపోవడంతో పాటు రూ.10వేల జరిమానా విధించనున్నట్లు ఐటీ శాఖా తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. పనిచేయని పాన్ కార్డు వాడినట్లు తేలితే వారికి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 272బీ కింద రూ.10,000 పెనాల్టీ విధిస్తారు. 

పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేయడంలో విఫలమైన వారు పన్ను చెల్లింపులు మినహా బ్యాంక్ ఖాతా తెరిచేందుకు గుర్తింపు కార్డుగా వాడటం వంటి వెసులుబాటు ఉన్నా రూ.50,000 మించి లావాదేవీలు జరిపే క్రమంలో రూ.10,000 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. పాన్ కార్డులను ఆధార్ తో లింక్ చేయని వారి పాన్ ఏప్రిల్ 1 నుంచి పని చేయదు. అయితే ఆధార్ తో అనుసంధానం పూర్తి చేసిన అనంతరం వారి పాన్ కార్డు తిరిగి పని చేస్తుంది. 

ఆధార్ తో పాన్ లింక్ ఇలా…

ఆధార్ తో పాన్ లింక్ చేసుకోవడం సులభమే. అయితే కొన్ని సందర్భాల్లో రెండు అనుసంధానం కాకపోవచ్చు. ఆధార్, పాన్ కార్డుల్లో పేరు, జెండర్, పుట్టిన తేదీ వంటి వివరాలు వేర్వేరుగా ఉన్నా కూడా రెండు లిక్ కావు. ఆధార్ కార్డును యూఐడీఏఐ జారీ చేస్తే, పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేసింది. పాన్, ఆధార్ కార్డుల్లో పేరు, జెండర్, పుట్టిన తేదీ వంటి వివరాలు వేర్వేరుగా ఉంటే అప్పుడు ఆధార్, పాన్ కార్డుల్లో వివరాలను సరిచేయాలి. 

  • ఆధార్ కార్డుల్లో తప్పుగా ఉన్న పేరును మార్చుకోవాలంటే https://ssup.uidai.gov.in/ssup/login.html లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఆన్ లైన్ లో లేదా ఎన్ రోల్మెంట్ సెంటర్ కు వెళ్లి ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. 
  • ఆదాయ పన్ను శాఖ వెబ్ సైట్ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html లో పాన్ వివరాలను సరి చేసుకోవచ్చు. 

పాన్ కార్డులో వివరాలు ఏమీ తప్పుగా లేకపోతే, ఆన్ లైన్, ఎస్ఎంఎస్, పాన్ కేంద్రాలలో రెండింటిని లింక్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా 567678 లేదా 56161 నెంబర్ కు యూఐడీపాన్ 12 అంకెల ఆధార్ పది అంకెల పాన్ నెంబర్ ను ఎస్ఎంఎస్ పంపడం ద్వారా పాన్ ఆధార్ లింకేజ్ ను పూర్తి చేయవచ్చు.

ఇక నేరుగా ఆదాయపన్ను శాఖ వెబ్ సైట్ http://www.incometaxindiaefiling.gov.in/home లోకి వెళ్లి పాన్ (యూజర్ ఐడీ), పాస్ వర్డ, పుట్టిన తేదీ ఎంటర్ చేసి ప్రొఫైల్ సెట్టింగ్ ట్యాబ్ పై క్లిక్ చేసి లింక్ ఆధార్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ మీ పాన్ ఆధార్ నెంబర్ తో లింక్ అయినట్టు మెసేజ్ కనిపించకపోతే అక్కడ కనిపించే ఫామ్ లో మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఒకసారి మీ వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత స్క్రీన్ పై సక్సెస్ మెసేజ్ కనిపిస్తుంది. 

Leave a Comment