నగ్న వీడియోలు తీసి రూ.15 లక్షలు దోచుకుంది..!

వ్యాపారవేత్త నగ్న వీడియోలు తీసి రూ.15 లక్షలు దోచుకుంది ఓ కిలాడీ లేడీ.. చివరికి కటకటాల పాలైంది. వివరాల మేరకు కర్నాటక రాష్ట్రం కొప్పళ్ లో స్టీల్ కంపెనీ పెట్టిన ఓ వ్యాపారవేత్త హోస్పేట్ లోని ఎంజే నగర్ 6వ క్రాస్ లో కార్యాలయం ఏర్పాటు చేశాడు. ఆ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఇంట్లో గీతా అనే మహిళ నివాసం ఉంటుంది. 2019 మార్చిలో వ్యాపారవేత్తకు, గీతకు మధ్య పరిచయం ఏర్పడింది. 

ఓ రోజు గీతా ఆ వ్యాపారవేత్తను ఇంటికి రావాలని ఆహ్వానించింది. వచ్చిన తర్వాత ఆయనకు తేనీరు ఇచ్చింది. తేనీరు తీసుకున్న తర్వాత ఆ వ్యాపారవేత్త మూర్ఛబోయాడు. ఓ గంట తర్వాత తేరుకొని ఇంటికి వెళ్లాడు. రెండు రోజుల తర్వాత గీతా ఆ వ్యాపారవేత్తకు ఫోన్ చేసింది. అతని నగ్న వీడియోలు తన వద్ద ఉన్నాయని, రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. 

దీంతో ఆ వ్యాపారవేత్త గీతా బ్యాంక్ ఖాతాకు రూ.15 లక్షలు జమ చేశాడు. మిగితా డబ్బులు ఇవ్వాలని, లేకపోతే వీడియోలు బయటపెడతానని బెదిరించింది. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తనిఖీ చేపట్టాగా గీతా ఇంట్లో 2.75 గ్రాముల గంజాయి లభించింది. దీంతో గీతా ఆమె కుమారుడు  విష్ణను పోలీసులు అరెస్టు చేశారు.   

Leave a Comment