నీళ్లు అడిగి తాగుతున్న ఉడత.. వీడియో వైరల్..!

ఉడత అసలు చిన్న శబ్దం వచ్చినా తుర్రున పారిపోతుంది. అలాంటి ఉడత దాహంతో నీళ్లు అడిగి మరీ తాగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటోంది. ఈ వీడియోను సుశాంత్ నందా అనే అటవీ అధికారి ట్విట్టర్ లో షేర్ చేశారు. 

దాహంతో ఉన్న ఉడత..వాటర్ బాటిల్ తో వెళ్తున్న వ్యక్తి వెంట పడుతుంది. ఆ వ్యక్తి వెనకాల తిరుగుతూ రెండు కాళ్లపై నిలుచుని నీళ్లు కావాలంటూ ముందు కాళ్లను చాచింది. మొదట ఆ వ్యక్తికి అర్థం కాలేదు. తర్వాత బాటిల్ మూత తీసి ఉడత నోటికి అందించగా అందులోని నీళ్లను గటగటా తేగేసి వెళ్లిపోయింది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో లక్షల్లో వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 

 

Leave a Comment