వీధి దీపం కింద చదువుతున్న పిల్లాడు.. ఇది సిగ్గుచేటు అంటూ..!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో పోస్టులు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోలు, ఫొటోలు ఉంటాయి.. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఐఏఎస్ ఆఫీసర్ దుష్యంత్ కుమార్ ఈ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో ఓ పిల్లవాడు రాత్రిపూట గుడిసేపై కూర్చొని వీధి లైట్ కింద చదువుతున్నాడు. 

ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. దీనిపై కామెంట్లు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. పిల్లవాడికి చదువంటే ఎంత ఇష్టమో అని కొందరు కామెంట్ చేస్తుండగా.. ఇది గర్వకారణం కాదు.. సిగ్గుచేటు అని మరి కొందరు అంటున్నారు. ఆ పిల్లవాడు ఉత్తర్ ప్రదేశ్ లోని బిజ్నోర్ కి చెందిన వాడని తెలిసింది.. ఈ ఫొటోపై ఎటువంటి రాజకీయాలు చేయవద్దని, విద్యార్థి స్ఫూర్తిని మెచ్చుకోవాలని అంటున్నారు. మరీ ఈ ఫొటోపై మీరు ఏం చెబుతారో కామెంట్ చేయండి.. 

Leave a Comment