అభిమానులకు సారీ చెప్పిన ఎన్టీఆర్..!

బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన బ్రహ్మస్త్ర ఈనెల 9న విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆలియా భట్ నటించగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కింగ్ నాగార్జున ఈ సినిమాలో కీ రోల్ చేశారు.  పోషించారు. తెలుగులో ఈ మూవీని దర్శధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నారు.. ఈ సినిమా ప్రమోషన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు.. 

 

ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఈవెంట్ కి అభిమానులు రాలేకపోయినందుకు ముందుగా వారికి క్షమాపణలు చెప్పారు. అనంతరం అమితాబ్ బచ్చన్, రణ్ బీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జునలపై తారక్ ప్రశంసలు కురిపించారు. తాను అమితాబ్ కి పెద్ద ఫ్యాన్ అని తెలిపారు. ఇండియన్ సినిమాలో ఆయన ఒక మార్క్ ని క్రియేట్ చేశారని ప్రశంసించారు. 

 

రణ్ బీర్ కపూర్ తనకు బాగా కనెక్ట్ అయిన నటుల్లో ఒకరని తెలిపారు. రణ్ బీర్ నటించిన ‘రాక్ స్టార్’ తన ఫేవరేట్ అని చెప్పారు. అందులో రణ్ బీర్ ఇంటెన్సిటీ చాలా బాగుంటుందని అన్నారు. ఆయనతో ఇలా హైదరాబాద్ లో స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రణ్ బీర్ మరింత గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. నాగార్జున బాబాయ్ ఎన్నో గొప్ప సినిమాతు చేశారని, నటుడిగా, స్టార్ గా ఆయన గురించి చెప్పే ఏజ్ తనకు లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ ప్రెజర్ లో ఉందన్నారు. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారని, గుడ్ అండ్ గ్రేట్ సినిమాలు ఇవ్వగలుగుతామని తెలిపారు. 

Leave a Comment