ప్రపంచంలోని ఈ 6 ప్రదేశాల్లో సూర్యుడు ఎప్పుడూ అస్తమించడు..!

రోజులో 24 గంటలు ఉంటాయి. అందులో మనం 12 గంటలు సూర్యకాంతిలో, మిగిలిన సమయం చీకటిలో గడుపుతాము.. అయితే సూర్యుడు అస్తమించకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. కానీ అలాంటి ప్రదేశాలు ఉన్నాయి.. మరి సూర్యుడు అస్తమించని ఈ 6 ప్రదేశాల గురించి తెలుసుకుందాం. 

నార్వే:

నార్వే ఆర్కిటిక్ ఖండంలో ఉంది. ఈ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మే నుంచి జూలై మధ్యలో దాదాపు 76 రోజులు సూర్యుడు అస్తమించడు. నార్వేలోని స్వాల్ బార్డ్ లో ఏప్రిల్ 10 నుంచి ఆగస్టు 23 వరకు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాడు. 

కెనడా:

కెనడాలోని ఓ ప్రదేశం నునావట్. ఇది కెనడాలోని వాయువ్య భూభాగాల్లో, ఆర్కిటిక్ సర్కిల్ కి దాదాపు రెండు డిగ్రీల ఎత్తులో ఉంది. ఈ ప్రదేశంలో దాదాపు రెండు నెలల పాటు సూర్యుడు అస్తమించడు. శీతాకంలో మాత్రం ఏకంగా 30 రోజులు అక్కడ రాత్రి మాత్రమే ఉంటుంది. 

ఐస్లాండ్:

ఐరోపాలో గ్రేట్ బ్రిటన్ తర్వాత ఐస్లాండ్ అతి పెద్ద ద్వీపం.. ఒక్క దోమ కూడా లేని ఏకైక దేశం.. ఇక్కడ జూన్ నెలలో మొదలు సూర్యాస్తమం ఉండదు. అర్ధరాత్రి కూడా సూర్యుడు కనిపిస్తాడు. 

అలస్కా:

అలస్కాలోని బారోలో మే నెలాఖరు నుంచి జూలై నెలాఖరు వరకు సూర్యుడు అస్తమించడు. కానీ నవంబర్ నుంచి రోజుల వరకు సూర్యుడు ఉదయించడు. దీనిని పోలార్ నైట్ అని అంటారు. 

ఫిన్లాండ్:

ఫిన్లాండ్ ను ల్యాండ్ ఆఫ్ లేక్స్ అండ్ ఐలాండ్స్ అంటారు. ఇక్కడ వేసవి కాలంలో 70 రోజుల పాటు సూర్యుడు అస్తమించడు. పైగా అందమైన హిమనీ నదాలు, మంచుపై స్కీయింగ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.

స్వీడన్:

స్వీడన్ లో మే ప్రారంభం నుంచి ఆగస్టు చివరి వరకు సూర్యుడు అర్ధరాత్రి అస్తమిస్తాడు. మరియు సాయంత్రం 4 గంటలకు ఉదయిస్తాడు. ఇక్కడ 6 నెలల పాటు ఎండలు నిరంతరాయంగా ఉంటాయి. అంటే ఈ 6 నెలల్లో ఇక్కడ సూర్యుడు అస్తమించడు.  

  

Leave a Comment