యూట్యూబ్ చూస్తూ బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక.. ప్రియుడు అరెస్ట్..!

ఇటీవల ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు యూట్యూబ్ ను ఫాలో అవుతున్నారు. కొందరు యూట్యూబ్ లో వీడియోలు చూసి సొంతం ట్రీట్మెంట్ కూడా చేసుకుంటున్నారు. తాజాగా ఓ 17 ఏళ్ల మైనర్ బాలిక యూట్యూబ్ వీడియోల సాయంతో ప్రసవించింది. వీడియో సాయంతో సొంతంగా ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఈనెల 20న కేరళలోని మలప్పురం జిల్లాలో వెలుగుచూసింది. 

మలప్పురంలో ఓ 17 ఏళ్ల మైనర్ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఆమె తల్లికి కళ్లు కనిపించవు. తండ్రి ఏమో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే ఈ బాలిక తన పక్కింట్లో ఉండే 21 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. తల్లికి కళ్ల కనిపించకపోవడంతో ఈ విషయాన్ని గుర్తించలేకపోయింది. తండ్రి రాత్రి పూట విధులు నిర్వర్తిస్తూ ఇంటికి ఎక్కువగా వచ్చేవాడు కాదు. 

ఈక్రమంలో బాలికకు నెలలు నిండాయి. ఈనెల 20న బాలిక ఇంట్లోని గదిలోకి వెళ్లి పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. యూట్యూబ్ లో చూసి బొడ్డుతాడును కత్తిరించుకుంది. ఈ విషయం రెండు రోజుల వరకు బాలిక తల్లిదండ్రులకు తెలియలేదు. ఓ రోజు బాలుడు ఏడవడంతో విషయం బాలిక తల్లికి తెలిసింది. 

బాలికకు, బిడ్డకు ఇన్ఫెక్షన్ కూడా అయింది. బాలిక తల్లి కూతురును మందలించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో ఆస్పత్రి సిబ్బంది ఈ విషయాన్ని మలప్పురం జిల్లా శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మైనర్ బాలిక గర్భం దాల్చడానికి కారణమైన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  

 

Leave a Comment