ఆకాశంలో మరోసారి అద్భుతం..ఈనెల 10న వలయాకార సూర్యగ్రహణం 

ఆకాశంలో మరోసారి అద్భుతం జరగబోతుంది. ఈనెల 10న వలయాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 1.42 గంటల నుంచి సాయంత్రం 6.41 గంటల మధ్య ఇది ఏర్పడనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) తెలిపింది. అయితే భారత్ లోని ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో ఇది పాక్షికంగా కనిపించనుంది. ఉత్తర అమెరికా, కెనడా, ఐరోపా, రష్యాలో ఇది సంపూర్ణంగా కనిపించనుంది. ఈ ఏడాదిలో ఏర్పడనున్న తొలి సూర్య గ్రహణం ఇదే కావడం గమనార్హం..

వలయాకార సూర్యగ్రహణం అంటే ఏమిటి?

సాధారణంగా సూర్య గ్రహణాలు 3 రకాలు ఉంటాయి. సంపూర్ణ సూర్యగ్రహణం, పాక్షిక సూర్య గ్రహణం, వలయాకార సూర్య గ్రహణం. వలయాకార సూర్యగ్రహణంలో సూర్యుని కేంద్ర భాగం కనిపించకుండా చంద్రుడు అడ్డుగా ఉంటాడు. దీంతో చంద్రుడి వెనుక సూర్యుడి వెలుపలి భాగం వలయాకారంలో మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఆ వలయాన్ని ‘అగ్ని వలయం’(రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు.

ఎక్కడ కనిపిస్తుంది?

ఈనెల 10న ఏర్పడే సూర్య గ్రమణం భారతదేశంలో పాక్షికంగా కనిపిస్తుంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, లడఖ్ లాంటి ప్రదేశాల్లో కనిపిస్తుంది. అయితే ఈ సూర్య గ్రహణం ప్రభావం భారత్ లో అంతగా ఉండకపోవచ్చు. భారత్ లో కాకుండా ఈ సూర్య గ్రహణం ఈశాన్య అమెరికా, ఐరోపా, ఆసియా, అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తర భాగంలో పాక్షికంగా కనిపిస్తుంది. గ్రీన్ లాండ్, ఉత్తర కెనడా, రష్యా లాంటి ప్రదేేశాల్లో సంపూర్ణంగా కనిపిస్తుంది. ఈ దేశాల్లో సూర్య గ్రహాణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ స్పష్టమైన రూపంలో కనిపిస్తుంది. 

 

 

Leave a Comment