చెక్కతో ట్రేడ్ మిల్.. క్రియేటివిటీ సూపర్ కదూ..!

కళలకు పెట్టింది పేరైన విశ్వకర్మల చేతుల్లో ఎన్నో కళాకండాలు జీవం పోసుకుంటాయి. పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు జీవన విధానాన్ని సౌకర్యవంతంగా, కళాత్మకంగా తీర్చిదిద్దడంతో వీరిదే సింహభాగం. అలాంటి విశ్వకర్మల్లో ఒకరు వడ్రంగులు.. అప్పటి నాగలి నుంచి ఇప్పటి ట్రేడ్ మిల్ వరకు ఏదీ చేసినా అది వారి చేతుల్లో ఉన్న వైవిధ్యమే.. అదేంటీ మధ్యలో ట్రేడ్ మిల్ ఎందుకొచ్చింది అనుకుంటున్నారా.. విద్యుత్, బ్యాటరీతో పనిచేకుండా చెక్కతో ట్రేడ్ మిల్ రూపొందించి తన నైపుణ్యం చాటుకున్నాడు ఓ వడ్రంగి.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

చెక్క స్టాండ్లలో.. ఒక స్టాండ్ కి కొన్ని బేరింగులు, మరో స్టాండ్ కి వాటికి అమరే విధంగా రింగులను అమర్చాడు. మరోవైపు అప్పటికే గొలుసు తరహాలో తయారు చేసి పెట్టుకున్న చెక్క పలకలను వాటిపై బిగించాడు. దానిపై మనిషి నిలబడేందుకు వీలుగా ఏర్పాట్లు చేశాడు.. అంతే ట్రేడ్ మిల్ తయారైపోయింది. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలై తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. ఇలాంటి వినూత్న ఆలోచలనను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన టీవర్క్ టీమ్ కి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా రిఫర్ చేశారు. ఆ వడ్రంగి ఎవరో గుర్తించి.. అతడి అభివృద్ధికి సహకరించాలన్నారు. అయితే ఈ ట్రేడ్ మిల్ తయారు చేసిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.   

 

Leave a Comment