Video Viral : హోలీ సంబరాల్లో ఫ్రెండ్స్ తో డ్యాన్స్..మద్యం మత్తులో కత్తితో పొడుచుకున్న యువకుడు..!

హోలీ పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ తో కలిసి డ్యాన్స్ చేస్తూ.. ఓ యువకుడు కత్తితో పొడుచుకున్నాడు. మద్యం మత్తులో కత్తితో తనపై తానే దాడి చేసుకున్నాడు. ఈ ఘటనలో అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

హోలీ సందర్భంగా శుక్రవారం కొందరు యువకులు సంబరాలు చేసుకుంటున్నారు. వారంతా మద్యం తాగి ఉన్నారు. ఆ యువకులంతా ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేస్తున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు చేతితో కత్తి పట్టుకొని ఉన్నాడు. పాట మధ్యలో తన గుండెపై పొడుచుకుంటూ స్టెప్పులు వేస్తున్నాడు. 

మద్యం మత్తులో పొడుచుకున్నప్పుడు ఆ యువకుడు గుర్తించలేదు. ఆ తర్వాత తన చొక్కాపై రక్తం చూసి షాక్ అయ్యాడు. వెంటనే ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ యువకుడు కత్తితో బలంగా పొడుచుకున్నాడు. దీంతో అతడి గుండెకు తీవ్ర గాయమైంది. రక్తం కూడా ఎక్కువగా పోవడంతో చికిత్స పొందుతూ అతడు మరణించాడు.. 

Leave a Comment