ఇండియాలో ఎవరూ సంతోషంగా లేరా?..UN ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’ లో మనకంటే ముందు పాక్..!

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2022 శుక్రవారం విడుదల చేశారు. ఈ రిపోర్ట్ లో ప్రపంచంలోని సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ నిలిచింది.  వరుసగా ఐదో సారి ఫిన్లాండ్ ఈ ఘనత సాధించింది. ఐక్యరాజ్యసమితి(UN) ఆధ్వర్యంలో 146 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఈ రిపోర్టును ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసింది. 

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టులో మన భారతదేశం 136వ స్థానంలో నిలిచింది. గతేడాది ఇండియా 139వ స్థానంలో ఉంది. అయితే మనకంటే పాకిస్తాన్(121), శ్రీలంక(127), నేపాల్(84), బంగ్లాదేశ్(94) మెరుగైన స్థానాల్లో నిలిచాయి. పౌరుల సంతోషం, ఆదాయం, ఆరోగ్యం, సామాజిక అంశాలు పరిశీలించి.. 0-10 పాయింట్ల ఆధారంగా ఈ రిపోర్టు రూపొందిస్తారు. ఈ నివేదికలో అఫ్ఘనిస్తాన్(146) చివరి స్థానంలో నిలిచింది. 

టాప్ 20 సంతోషకరమైన దేశాలు ఇవే:

ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్, స్వీడన్, నార్వే, ఇజ్రాయెల్, న్యూజిలాండ్, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, కెనడా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్ డమ్, చెకియా(చెక్ రిపబ్లిక్), బెల్జియం, ఫ్రాన్స్.

సంతోషంగా లేని టాప్ 10 దేశాలు:

ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్, జింబాబ్వే, రువాండా, బోట్స్వానా, లెసోతో, సియెర్రా లియోన్, టాంజానియా, మలావి, జాంబియా.  

ఇక ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్ల లోపు చిన్నారులు దాదాపు 10 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నట్లు వెల్లడైంది. ఈ చిన్నారులకు సాయం అందకపోతే వాళ్లంతా చనిపోయే అవకాశం ఉందని నివేదిక వివరించింది.

Leave a Comment