డీమార్ట్ లో కుళ్లిపోయిన ఖర్జురాలు.. కుషాయిగూడ డీమార్ట్ సీజ్ చేసిన అధికారులు..!

దేశంలోని ఉండే అనేక సూపర్ మార్కెట్లలో డీ మార్ట్ కూడా ఒకటి. ఇతర సూపర్ మార్కెట్లతో పోలిస్తే డీ మార్ట్ బెటర్ అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. ఎందుకంటే ఇతర సూపర్ మార్కెట్లలో కంటే రేటు కొంచం తక్కువగా ఉంటుంది. అయితే క్వాలిటీ విషయంలోనే కొంచం అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే హైదరాబాద్ లోని కషాయి గూడ డీమార్ట్ లో జరిగిన ఘటన చూస్తే షాక్ అవుతారు. 

గత నెల 30న కషాయిగూడ శివ సాయి నగర్ కు చెందిన వినియోగదారుడు తన డెబిట్ కార్డుతో ఇంటి కిరాణా సామాన్లతో పాటు కిమియా డేట్స్ కంపెనీకి చెందిన కొన్ని ఖర్జుర ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. ఈక్రమంలో ఈనెల 6న వాటిని తినేందుకు సీల్ ఓపెన్ చేశాడు. అంతే లోపల ఖర్జురాలు కుళ్లిపోయి ఉన్నాయి. 

ఎక్స్ పైరీ డేట్ చేస్తే ప్యాకెట్ పై డిసెంబర్ 2020 అని ఉంది. ఆ ప్యాకెట్ పై ఆరు నెలల గడువు కూడా ఉంది. అయినప్పటికీ ఖర్జూరాలు కుళ్లిపోయి ఉన్నాయి. దీనిపై అభ్యంతరం వినియోగదారుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. కిమియా డేట్స్ కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ కు కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. 

దీంతో వినియోగదారులు నాణ్యతా ప్రమాణాలు పాటించని కిమియా డేట్స్ కంపెనీపై, మోసపూరితంగా విక్రయిస్తున్న కుషాయిగూడ డీమార్ట్ పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు కుషాయి గూడ డీమార్ట్ ను తనిఖీ చేశారు. ఆ తర్వాత దాన్ని సీజ్ చేశారు. 

 

 

Leave a Comment