జామియాలో దాడి..కీలక వీడియో విడుదల

ఢిల్లీలోని జామియా యూనివర్సిటీ లైబ్రరీలో విద్యార్థులపై పోలీసుల దాడికి సంబంధించి విద్యార్థ సంఘం నాయులు కీలక విడియోను బయటపెట్టారు. పోలీసులు ఎంఏ/ఎంఫిల్ లైబ్రరీలోకి చొరబడి విద్యార్థులను లాఠీలతో కొడుతున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనబడుతున్నాయి. క్యాంపస్ మైదానంలో సీఏఏకు నిరసనగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులను లాఠీ చార్జీ, టియర్ గ్యాస్ తో చెదరగొట్టారు. ఈ దాడిలో విద్యార్థి నాయకురాలు ఆయిషీ ఘోష్ తలకు గాయమైంది. అనంతరం అక్కడి నుంచి లైబ్రరీలోకి ప్రవేశించిన పోలీసులు రీడిండ్ రూల్ లో చదువుకుంటున్న విద్యార్థులపై అకారణంగా దాడికి దిగారు. అప్పటికే పోలీసుల చర్య గురించి తెలుసుకున్న విద్యార్థులు బెంచీలు మాటున దాక్కున్నప్పటికీ బయటకు లాగి మరీ లాఠీలతో కొట్టారు. డిసెంబరు 15న ఈ ఘటనలో దాదాపు 100 విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విద్యార్థుల భారీ ర్యాలీ నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకు చర్యలు మాత్రమే చేపట్టామని, ఎవరిపై దాడులు చేయలేదని పోలీసులు పేర్కొనడం తెలిసిందే…

Leave a Comment