ఎంఎస్ఎంఈలకు భారీ సాయం

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ)ల బలోపేతం కోసం‘’రీస్టార్ట్’ పేరిట ఓ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. దీనిలో భాగంగా రెండు విడతలుగా రూ.1110 కోట్ల మేర సాయాన్ని ప్రకటించి ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం నుంచి చేయూతను అందించనున్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ప్రతినిధులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఎంఎస్ఎంఈలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, అందుకోసం రూ.905 కోట్ల బకాయిలతో పాటు రూ.187కోట్ల స్థిర విద్యుత్ చార్జీల మాపీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నిర్వహణ మూల ధనం రుణాలకు రూ.200 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

ఎంఎస్ఎంఈలకు కేవలం 6 నుంచి 8 శాతం వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. ప్రభుత్వం కొనుగోళ్లో 25 శాతం ఎంఎస్ఎంఈల నుంచే చేయాలని నిర్ణయించారు. అలా చేసిన కొనుగోళ్లకు 45 రోజుల్లో చెల్లింపులు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు విద్యుత్ డిమాండ్ ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

Leave a Comment