ఆడపిల్ల పుట్టిందని..  హెలికాప్టర్ లో ఇంటికి తీసుకొచ్చారు..!

ఆడపిల్ల పుడితే మహాలక్ష్మీ పుట్టిందని గతంలో పండుగ చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. ఏంటీ ఆడపిల్లా.. అంటూ దీర్ఘాలు తీస్తున్నారు.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వివక్ష ఇంకా ఎక్కువగా ఉంటుంది.. కానీ ఓ కుటుంబం మాత్రం ఆడపిల్ల పుట్టిందని ఆమె ఘన స్వాగతం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మహారాష్ట్రలో ఆడపిల్ల పడితే సంబరాలు చేసుకుంటారు. వారికి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కలసి వస్తుందని విశ్వస్తారు.. తాజాగా పూణెలోని షెల్ గావ్ కి చెందిన ఓ కుటుంబం మాత్రం ఆడపిల్ల పుట్టడంతో  పాపను ఇంటికి తెచ్చేందుకు ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేసింది.. వారి కుటుంబంలో జన్మించిన మొదటి ఆడపిల్ల కావడంతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. 

జనవరి 22న భోసారి పట్టణంలో ఓ మహిళ పుట్టింటి వద్ద రాజ్యలక్ష్మి అనే బిడ్డకు జన్మనిచ్చింది. పాప తండ్రి విశాల్ జరేకర్ తమ కుటుంబంలో ఆడపిల్ల పుట్టిందని ఎంతో సంబరపడ్డాడు. పాపకు ఘనస్వాగతం పలకాలని నిర్ణయించుకున్నాడు. వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉన్న జరేకర్ తన భార్య పుట్టింటి నుంచి పాపను షెల్ గావ్ కి తీసుకురావడనాకిి ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశాడు..

రూ.లక్ష ఖర్చు చేసి ఛాపర్ రైడ్ ని బుక్ చేసుకున్నాడు. హెలికాప్టర్ దిగేందుకు షెల్గావ్ లోని వారి పొలంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు.  ఏప్రిల్ 2న ప్రత్యేక హెలికాప్టర్ లో తల్లి, బిడ్డలను ఇంటికి తీసుకొచ్చి ఘనస్వాగతం పలికారు.. ఆడపిల్లల పట్ల ఆ తండ్రికి ఉన్న మహోన్నత భావానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

 

    

 

Leave a Comment