దేశంలో కరోనా థర్డ్ వేక్ కు ఇది సంకేతామా?

దేశంలో కరోనా మహమ్మారి కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. భారత్ లో కరోనా ఆర్ వ్యాల్యూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న ఆర్ విలువ కరోనా థర్డ్ వేవ్ కు సంకేతమా అనే వాదన వినిపిస్తోంది..

దేశంలో గత కొద్ది కాలంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈక్రమంలో దేశంలో కరోనా ఆర్ విలువ కూడా పెరుగుతోంది. ఆర్ విలువ అంటే.. ఒక రోగి నుంచి ఇన్ ఫెక్షన్ కు గురయ్యే సగటు వ్యక్తల అంచనా.. కొద్దిరోజులుగా ఈ ఆర్ విలువ దేశంలో పెరుగుతోంది. ఆర్ విలువ ఆగస్టు 14-17 మధ్యలో 0.89 ఉండగా.. అది ఆగస్టు 24-29 వరకు 1.17 కు చేరింది. కేరళలో కేసుల పెరుగుదల కారణంగా ఈ ఆర్ విలువ పెరుగుతున్నట్లు నిపుణులు తెలిపారు. కేరళలో ఆర్ విలువ అత్యధికంగా 1.33గా ఉంది. 

దీన్ని చూస్తే దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఎంట్రీ ఇచ్చిందా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. గతవారం రోజువారి కరోనా కేసులు చాలా స్వల్పంగా నమోదయ్యేవి. కానీ గత నాలుగు రోజులుగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే థర్డ్ వేవ్ ప్రారంభమైందనే అనిపిస్తోంది. 

దేశంలో థర్డ్ వేవ్ హెచ్చరికలు జారీ చేసినప్పుడు కరోనా ఆర్ విలువ 1.03గా ఉంది. కానీ ఇప్పుడు 1.20కి చేరువలో ఉంది. కేరళ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో ఈ ఆర్ విలువ ఆందోళనకర స్థాయిలో ఉంది. కేరళ, మహారాష్ట్ర, మిజోరం, జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా కేరళలో మరింతగా కేసులు పెరుగుతున్నాయి. కరోనా ఆర్ విలువ కేరళలో 1.33, మిజోరంలో 1.36, జమ్మూకశ్మీర్ 1.25, మహారాష్ట్ర 1.06, ఏపీ 1.09గా ఉంది. దేశంలో ప్రస్తుతం ఆర్ విలువ పెరుగుతోంది. ఆర్ విలువ పెరిగే కొద్దీ దేశంలో కరోనా థర్డ్ వేవ్ భయం పెరుగుతున్నట్లుగా అంచనా వేయవచ్చు.

Leave a Comment