నబంబర్ 19న సుదీర్ఘమైన చంద్రగ్రహణం..!

ఈనెల 19న చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఆకాశంలో దర్శనమివ్వబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 18, 19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. భారతదేశంలో మాత్రం నవంబర్ 19న శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం 3 గంటల 28 నిమిషాల పాటు ఏర్పడనుంది. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం కానుందట..

ఈ పాక్షిక చంద్ర గ్రహణం మన దేశంలోని అస్సాం, అరునాచల్ ప్రదేశ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో చూడవచ్చు. అలాగే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా పసఫిక్ ప్రాంతంలో ఈ పాక్షిక చంద్ర గ్రహణం దర్శనమివ్వబోతోంది. అమెరికా తూర్పు తీరంలో తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల వరకు, పశ్చిమ తీరంలో ఉన్న వారు రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్య ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం ఉందని నాసా చెబుతోంది.. నాసా అంచనాల ప్రకారం పాక్షిక చంద్ర గ్రహణం ఈనెల పౌర్ణమితో పాటు కలిసి రానుంది. దీనిని మంచుతో కప్పబడిన చంద్రుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం మే 26న ఏర్పడింది. 

Leave a Comment