ఫీజు లేకుండా చికిత్స.. ఆన్ లైన్ లో అన్ని స్పెషాలిటీల డాక్టర్లు..!

మీ ప్రాంతంలో సరైన స్పెషలిస్ట్ డాక్టర్లు లేరా.. మీరు స్పెషలిస్ట్ డాక్టర్ వద్ద ట్రీట్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. ఎలాంటీ ఫీజు లేకుండా నిపుణులైన వైద్యుల వద్ద చికిత్స తీసుకోవచ్చు.. ఈ-సంజీవని ఓపీడీ పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వయంగా అందిస్తున్న సర్వీస్ ఇది. దేశంలో ఎవరైనా దీనీనీ పూర్తి ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.. ఆన్ లైన్ లోనే స్పెషలిస్ట్ డాక్టర్ల వద్ద చికిత్స పొందవచ్చు.

ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో భాగంగా ఈ-సంజీవని ఓపీడీ స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వం 2021 ఏప్రిల్ లోనే ప్రారంభించింది. ఈ-సంజీవని ఓపీడీ పేరుతో  వెబ్ సైట్ మరియు ఆండ్రాయిడ్ యాప్ ని ప్రవేశపెట్టింది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటి దగ్గరే కూర్చొని తమకు అవసరమైన డాక్టర్లను సంప్రదించవచ్చు. ఈ-ప్రిస్క్రిప్షన్ ద్వారా డాక్టర్లు అవసరమైన వైద్యాన్ని సూచిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన డాక్టర్లు ప్యానెల్లో ఉంటారు. 

ఈ-సంజీవని ఓపీడీలో రిజిస్టర్ చేసుకోవడం ఎలా?

  • ముందుగా ఈ-సంజీవని ఓపీడీ అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా హోం పేజీలో పేషంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికోసం రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. అప్పుడు మీ మొబైల్ నెంబర్ కన్ఫార్మ్ అవుతుంది.
  • తర్వాత పేషంట్ రిజిస్ట్రేషన్ ఫారంను పూర్తి చేసి.. టోకెన్ కోసం రిక్వెస్ట్ పెట్టాలి.
  • ఒకవేళ పాత హెల్త్ రికార్డులు ఏమైనా ఉంటే వాటిని అప్లోడ్ చేయాలి. ఇది పూర్తయ్యాక పేషంట్ కి ఎస్ఎంఎస్ ద్వారా ఒక ఐడీ, టోకెన్ నెంబర్లు వస్తాయి.
  • ఆ ఐడీ నెంబర్ తో అపాయింట్మెంట్ కోసం లాగిన్ కావాలి. దీంతో మీరు ఆన్ లైన్ క్లినిక్ లోకి ప్రవేశిస్తారు. పేషంట్ల సంఖ్యను బట్టి మీకు నెంబర్ కేటాయిస్తారు. 
  • తర్వాత పేషంట్ కి డాక్టర్ ని కేటాయిస్తారు. అప్పుడు స్క్రీన్ మీద ‘కాల్ నౌ’ అనే బటన్ యాక్టివేట్ అవుతుంది. 120 సెకండ్లలో మీరు దానిని క్లిక్ చేయాలి. 
  • అప్పుడు డాక్టర్ మీకు వీడియోలో కనిపిస్తారు. ఆయనతో మీ సమస్యను చెప్పుకోవచ్చు. మీ రికార్డులను పరిశీలించి డాక్టర్ ఈ-ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. మీ మొబైల్ కి కూడా ప్రిస్క్రిప్షన్ వస్తుంది.
  • ఇక్కడ మరో వెసులుబాటు ఏంటంటే ఒక మొబైల్ నెంబర్ పై కుటుంబంలోని సభ్యులందరూ ఒకే ఫోన్ లో లాగిన్ అవ్వొచ్చు.

ఈ సేవలను ఆండ్రాయిడ్ యాప్ లో ఉపయోగించుకోవచ్చు. లేదా ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి మీరు డాక్టర్ ని సంప్రదించవచ్చు.. 

అధికారిక వెబ్ సైట్ : https://esanjeevaniopd.in/

Leave a Comment