ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. అమరావతిని అభివృద్ధి చేయాల్సిందే..!

ఆంధ్రప్రదేశ్ మూడు రాాజధానుల విషయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్మించాల్సిందేనని తీర్పునిచ్చింది. గత ప్రభుత్వం చేసిన సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదేశించింది. ఏపీ రాజధాని ప్లానింగ్ ను వచ్చే 6 నెలల్లో పూర్తి చేయాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేేసింది. 

అమరావతి భూములను రాజధానికి తప్ప వేరే అవసరాలకు వినియోగించుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో ప్లాట్లను అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆదేశించింది.

మాస్టర్ ప్లాన్ లో ఉన్నట్లుగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, లేని అధికారాలతో సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయలేరని గుర్తు చేసింది. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్ని కూడా తరలించకూడదని, పిటిషనర్లు అందరికీ ఖర్చుల కింద ప్రభుత్వం రూ.50 వేలు చెల్లించాలి హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

   

 

Leave a Comment