నడిచే ఇల్లు.. ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు..! 

మనం ఉన్న ఇల్లు ఎక్కడికెళ్లినా మన వెంటే వస్తే బాగుంటుంద కదూ.. అలాంటి వాకింగ్ హౌస్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఇంటిని ఫ్రాన్స్ చెందిన 3డి డైజనర్ రూపొందించారు. ఈ ఇంటికి ఉండే కాళ్లు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాయి. ఫ్రాన్స్ లోని ఉబిసాఫ్ట్ కు చెందిన 3డి డిజైనర్ ఎన్ కో ఎన్ షైవ్ వెరైటీగా ఈ కదిలే కాళ్ల ఇంటిని రూపొందించారు. 

ఈ ఇంటికి ఏర్పాటు చేసిన ‘మెకానికల్ లెగ్స్’ అడుగులు ముందుకు వేసుకుంటూ ఎక్కడికైనా వెళ్తుంది. ఏ గుట్టలు అయినా ఈజీగా దాటుతోంది. ఈ ఇంటి రూపకర్త దీనిని ‘రెట్రో-ఫ్యూచరిస్టిక్’ డిజైన్ అని చెప్పారు. ఈ నడిచే ఇంటికి ఆరు కాళ్లు ఉన్నాయి. ఎత్తు, లోతును బట్టి దాని కాళ్లను సెట్ చేయవచ్చు. పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిని ఈ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు, ఒక పెంపుడు జంతువును ఉంచుకోవచ్చు. 

ఈ నడిచే ఇంటిలో బెడ్ రూమ్, లివింగ్ ఏరియా, గెస్ట్ రూమ్, కిచెన్, డైనింగ్ టేబుల్, బాత్ రూమ్, పార్టీ కోసం టెర్సెస్, హై క్వాలిటీ ఫర్నిచర్ తో సహా స్మార్ట్ టెక్నాలజీ విండో గ్లాస్ కూడా ఉన్నాయి. ఇంటి కింది భాగంలో బైక్ లు, కార్లు పార్క్ చేయవచ్చు. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్, వాటర్ ట్యాంక్ కూడా ఉన్నాయి. 

ప్రస్తుతం డిజైన్ రూపంలో ఉన్న ఈ వాక్ – ఇన్ హౌస్ ని భవిష్యత్తులో నిర్మంచనున్నట్లు ఎంకో ఎన్సెన్ చెప్పారు. అదే జరిగితే.. భవిష్యత్తులో పిక్నిక్ లకు వెళ్లినప్పుడు కార్లలో కాకుండా నడిచే ఇంటిని తీసుకెళ్లవచ్చని 3డి డిజైనింగ్ పరిశ్రమ చెబుతోంది. 

Leave a Comment