30 ఏళ్లు దాటాయా.. అయితే ఈ ఆహారాలను రోజూ తీసుకోవాల్సిందే..!

ఒకప్పుడు మనుషలు చాలా బలంగా ఉండేవారు. కానీ ఈ రోజుల్లో 20 నుంచి 30 మధ్య వయసు ఉన్నప్పుడే ఎంతో కొంత ఆరోగ్యంగా ఉంటున్నారు. అదే 30 ఏళ్లు దాటితే ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఇక 50 ఏళ్లు వచ్చే వరకు ఈ సమస్య మరింత పెరిగియి 60 ఏళ్ల వరకు ఏమైపోతామో తెలియట్లేదు..అందువల్ల వయసు పైబడుతున్న వారు కచ్చితంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా 30 దాటిన వారు రోజూ తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి..

1.అవిసె గింజలు

అవిసె గింజల్లో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అవిసె గింజల యొక్క మూడు ముఖ్యమైన పోషక అంశాలు ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, లిగ్నన్స్ మరియు మ్యుసిలేజ్.. ఇవే కాకుండా అవిసె గింజల్లో విటమిన్ బి1, ప్రోటీన్స్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, జింక్ మరియు సెలీనియం లభిస్తాయి. వీటిని రోజూ గుప్పెడు మోతాదులో తినవచ్చు. ఇవి క్యాన్సర్, జీర్ణ సమస్యలు రాకుండా చేస్తాయి. 30 ఏళ్లకు పైబడిన వారికి ఈ గింజలు ఎంతగానో మేలు చేస్తాయి. 

2.మచా టీ

30 ఏళ్లు దాటిన వారు ప్రతి రోజూ మచా టీ తాగాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సంవృద్ధిగా ఉంటాయి. ఒక టీస్పూన్ మచా టీ పొడితో టీ తయారు చేసుకుని తాగితే.. పాలకూర కంటే 60 రెట్లు ఎక్కవగా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇందులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. దీంతో లివర్, గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. 

3.అశ్వగంధ

ఇక 30 ఏళ్లు దాటాక స్త్రీ, పురుషుల్లో శృంగార సమస్యలు వస్తుంటాయి. శృంగారంలో చురుగ్గా పాల్గొనాలన్నా.. చురుగ్గా పనిచేయాలన్నా.. రోజూ అశ్వగంధను తీసుకోవాలి. అశ్వగంధలో యాంటీ ఆక్సిడెంట్లు పెంచే లక్షణాలు ఉంటాయి. వయసు పెరిగినా కూడా పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. ప్రతిరోజూ నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో అర టీస్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తాగితే ఫలితం ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. 

4.చియా సీడ్స్

చియా సీడ్స్ లో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ ఉంటుంది. వీటిలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. యూరోపియన్ యూనియన్ చియాను అద్భుతమైన ఆహారంగా అంగీకరించింది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అధిక బరువును, షుగర్ లెవల్స్ ని తగ్గిస్తాయి. 30 ఏళ్లు పైబడిన వారికి షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చియా సీడ్స్ ని రోజూ నీటిలో నానబెట్టి తింటే ఈ సమస్య రాకుండా అడ్డుకోవచ్చు. 

5.బాదం

బాదంలో అనేక పోషకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, మినరల్స్ ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్ ని తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుతాయి. 30 ఏళ్లు దాటిన వారు రోజూ బాదం పప్పులను తినాలి. 

6.క్వినోవా

క్వినోవా అనేది ఒక సూపర్ ఫుడ్.. 30 ఏళ్లు దాటిన వారు దీన్ని రోజూ తింటే జీర్ణ సమస్య రాకుండా ఉంటాయి. క్వినోవాలో ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి షుగర్ లెవెల్స్ ని తగ్గించి బరువును అదుపులో ఉంచుతాయి. 

 

Leave a Comment