త్వరలోనే శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు..

లాక్ డౌన్ నిబంధనలు సడలించాలకే ప్రభుత్వం అనుమతించిన వెంటనే తిరుమలలో దర్శనం ప్రారంభమవుతుందని టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దర్శనం ఏర్పాట్లను ఇప్పటికే టీటీడీ సిద్ధం చేసిందని, వీలైనంత త్వరగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని అన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సమావేశమైంది. 

ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ టీటీడీ ఆస్తులు కానీ, భూములు కానీ భక్తుల కానులను ఇకపై అమ్మకాలు జరపరాదని నిర్ణయించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో టీటీడీ పాలకమండలి తీసుకున్న  నిర్ణయాలపై  సమగ్ర విచారణ జరుపుతామన్నారు. ఇకపై టీటీడీ భూములు ఎక్కడ ఎప్పుడు వేలం ద్వారా వేయకుండా నిర్ణయం తీసుకున్నామన్నారు. 

టీటీడీ భూములు అన్యక్రాంతం కాకుండా కాపాడుతామని, ఒకవేళ అన్యాక్రాంతమైతే వాటి పరిరక్షణకు స్వామిజీలతో కమిటీ వేస్తామన్నారు. తిరుమలలో పాత భవనాల ఆధునీకరణ కోసం జరిగిన కేటాయింపులలో టీటీడీపై కావాలనే   దుష్ప్రప్రచారం చేసిన వారిపై విచారణ జరపాలని కోరుతున్నామన్నారు. 

గత బోర్డ్ తీసుకొన్న నిర్ణయం పై విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తామన్నారు. పాలక మండలి పై ఆరోపణలు చేసిన వారిపై సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. పాత గెస్ట్ హౌస్ లు ఇవ్వాలన్నా ఇకపై పారదర్శక పాటిస్తామన్నారు. నామినేషన్ పై గెస్ట్ హౌస్లు కేటాయించడం లేదన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 

 

Leave a Comment