రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్

వచ్చే రబీ నుంచి 100 శాతం ఫీడర్లలో రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. విద్యుత్ రంగంపై సీఎం సమీక్ష నిర్వహించారు. 10వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ప్లాంట్‌ ఏర్పాటుపై  సమీక్ష చేశారు. ఈ సందర్బంగా ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. 

మే నెలాఖరు నాటికి పనులు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని  అధికారులు పేర్కొన్నారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌పైనా చర్చించారు. గత ఖరీఫ్‌లో 58 శాతం ఫీడర్లలో 9 గంటలపాటు రైతులకు పగటిపూట విద్యుత్‌ ఇవ్వగలిగామని అధికారులు వెల్లడించారు. ఈ ఖరీఫ్‌లో 81శాతం ఫీడర్లలో 9 గంటలపాటు పగటిపూట విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 

కోవిడ్‌ –19 కారణంగా సప్లైయిస్ కి ఇబ్బంది కలిగిందని, దీనివల్ల మిగిలిన 19 శాతం ఫీడర్లలో పనులు మందగించాయని సీఎంకు అధికారులు తెలిపారు.  పనులు పూర్తి చేసి వచ్చే రబీ నాటికి 100 శాతం ఫీడర్లలో 9 గంటలు పగటిపూట కరెంటు ఇవ్వాలని స్పష్టం చేశారు. 

Leave a Comment