రాష్ట్రంలో 8 ఫిషింగ్ హార్బర్లు

ప్రభుత్వం మత్స్యకారులకు మహర్దశ కల్పించునుంది. రాష్ట్రంలో 8 చోట్ల ఫిషింగ్ హార్బర్లు, ఒక చోట ఫిష్ ల్యాండ్ నిర్మించునుంది. వీటి కోసం దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన ఫిషింగ్ హార్బర్లపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. మొత్తం 9 ప్రాంతాల్లో చేపల వేటకు మౌలిక సదుపాయాలు కల్పించనుంది జగన్ ప్రభుత్వం. 

రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు ఎవ్వరూ కూడా ఇతర రాష్ట్రాలకు వలస పోకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. రెండు మూడేళ్లలో హార్బర్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేయాలని సీఎం తెలిపారు. 

గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో కేవలం మూడు ఫిష్‌ ల్యాండింగ్‌ ఫెసిలిటీస్‌ మాత్రమే ఇచ్చారని మంత్రి మోపిదేవి వెంకట రమణ వివరించారు. గుండాయిపాలెం (ప్రకాశం), అంతర్వేది, ఓడలరేవు (తూ.గో)లకు కేవలం రూ.40 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఇప్పుడు దాదాపు రూ.3000 కోట్లు ఖర్చుచేసి 8 ఫిషింగ్‌ హార్బర్లు, ఒక ఫిష్‌ ల్యాండ్‌ కట్టబోతున్నామని మంత్రి మోపిదేవి తెలిపారు. 

రాష్ట్రంలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ల వివరాలు..

శ్రీకాకుళం జిల్లాలో బడగట్లపాలెంలో – మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్ 

శ్రీకాకుళం జిల్లాలోని మంచినీళ్లపేటలో – ఫిష్‌ ల్యాండ్‌ నిర్మాణం 

విశాఖపట్నం జిల్లా పూడిమడకలో –  మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్

తూర్పూ గోదావరి జిల్లా ఉప్పాడలో – మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో – మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో – మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్

గుంటూరుజిల్లా నిజాంపట్నంలో – మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్

ప్రకాశం జిల్లా  కొత్తపట్నంలో– మేజర్‌ షిఫింగ్‌ హార్బర్‌

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో– మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌ 

మత్స్యకారులు వలస పోకూడదు – సీఎం

 

Leave a Comment