ఒక్క యాప్ తో 600 రకాల సేవలు ..

UMANG APP అంటే ఏమిటి ? 

భారతదేశంలో మొబైల్ పాలనను నడిపించాలనే ఆలోచనతో న్యూ-ఏజ్ గవర్నెన్స్ అప్లికేషన్ కోసం యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్‌గా వివరించిన UMANG APPను నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (నెజిడి) మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మీటీవై) అభివృద్ధి చేశాయి.

భారత ప్రభుత్వం ప్రారంభించిన UMANG APP  ద్వారా దాదాపు 104 డిపార్డ్ మెంట్లకు సంబంధించిన దాదాపు 600 రకాల సేవలను పొందవచ్చు. UMANG APP ను భారత ప్రభుత్వం ముఖ్యంగా డిటిజల్ పేమెంట్ లావాదేవీలను లక్ష్యంగా చేసుకుని రూపొందించింది. రెండేళ్ల క్రితం UMANG APPను భారత ప్రభుత్వం ప్రారంభించింది. 

UMANG APPలో కేంద్, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఎన్నో రకాల సవలను పొందవచ్చు. ఆధార్, పాన్, గ్యాస్ బుకింగ్, ఆదాయపు పన్ను రిటర్న్స్, పాస్ పోర్ట్ తదితర సేవలను UMANG APP ద్వారా పొందవచ్చు. UMANG APP సేవలను ఆండ్రాయిడ్ తో పాటు ఐఓఎస్ మొబైల్ యూజర్లు వినియోగించుకోవచ్చు.

డిజిటల్ ఇండియాలో భాగంగా నేషనల్ ఈగవర్నెన్స్ డివిజన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా UMANG APP ను రూపొందించాయి. 

UMANG APPను ఉపయోగించి పాస్ పోర్టుకు సంబంధించిన సేవలు, ఆధార్ సేవలు, గ్యాస్ బుకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు. సీబీఎస్ ఈ ఫలితాలను కూడా ఈ యాప్ ద్వారా చూసుకోవచ్చు. ఉద్యోగులు వారి ఫీఎఫ్ ఖాతా వివరాలను ఈ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఫీఎఫ్ విత్ డ్రా, అలాగే స్టేటస్ తదితర సేవలను పొందవచ్చు. ఇందులో ఇన్ కమ్ ట్యాక్స్ పే చేయవచ్చు. పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పాన్ కార్డు స్టేటస్ ను కూడా UMANG APP ద్వారా తెలుసుకోవచ్చు.

మీరు కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా..అయితే UMANG APPను ఉపయోగించి పలు సర్వీసులు పొందవచ్చు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కోసం ఈ యాప్ లో అప్లయి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, అప్లికేషన్ స్టేటస్, ఎలిజిబిలిటీ, స్టేటస్ చెక్, సబ్సిడీ క్యాలిక్యూలేటర్ వంటి సేవలు UMANG APP ద్వారా పొందవచ్చు.

Leave a Comment