జుట్టు రాలడాన్ని ఆపడం ఎలా..

How to stop hair loss ..

మనిషి జీవితంలో జుట్టు రాలడం సహజం. పాత జట్టు రాలి దాని స్థానింలో కొత్త జట్టు వస్తుంది. కాని, దువ్విన ప్రతిసారీ జుట్టు రాలడం, జుట్టు పలుచపడటం, బట్టతల వంటి లక్షణాలు ఉన్నప్పుడు సమస్య ఏర్పడుతుంది.

అయితే జట్టు రాలడం అనేది మహిళల కంటే పురుషులలో ఎక్కవగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం తీవ్ర ఒత్తిడి, ఆకస్మికంగా బరువు తగ్గడం, పోషకాహార లోపం వల్ల జట్టు రాలడం అనేది జరుగుతుంది. వయస్సు పెరిగే కొద్ది దీని తీవ్రత కూడా క్రమంగా పెరుగుతూ ఉంటుంది. 

మనిషి జీవితంలో ప్రతి రోజూ కొంత మొత్తంలో జుట్టు రాలడం అనేది అనివార్యం. ఒకవేళ జుట్టు ఎక్కువగా రాలుతుంటే దానికి తగిన జాగ్రత్తలు పాటించడం అవసరం. దీనికి కొన్ని రకాల చిట్కాలు, నివారణలు, చికిత్సలు ఉన్నాయి. 

జుట్టు నివారణకు చిట్కాలు..

జుట్టు రాలడంలో మనషుల ఆహార విధానం, పోషకాలు, వ్యాయామం, ఆరోగ్యం ప్రముఖ పాత్ర పోషిస్తాయి. జుట్టు పలుచపడటం, రాలడాన్ని నివారించడానికి పలు రకాల చిట్కాలను ఉపయోగించవచ్చు. జుట్టు రాలడాన్ని నివారించే చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఆహార విధానం..

Food for reduce hair fall..

జుట్టు రాలడాన్ని నివారించేందుకు సరైన పోషకాహారం చాలా ముఖ్యం. దీనికి మనం సమతుల్య ఆహారం తీసుకోవాలి. అయితే కొన్ని విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పదార్థాలు జుట్టు రాలడాన్ని నివారించడంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. 

జుట్టు కోసం విటమిన్లు..

Vitamins for hair loss

విటమిన్-ఇ

విమమిన్-ఇ జుట్టుకు పోషకాలను అందిస్తుంది. ఇది ఆక్సిడేటివ్ ఒత్తిడి వల్ల కలిగే అన్ని రకాల నష్టాల నుంచి జుట్టును సంరక్షించడంలో ఉపయోగపడుతుంది. పురుషులలో బట్టతల రావడానికి ఆండ్రోజెనిక్ అలోపేసియా ముఖ్యకారణంగా గుర్తించబడింది.

అందుకోసం మన ఆహారంలో విటమిన్ ఇ ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా చేర్చాలి. బాదం, ఆక్రోటు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు, సోయాబీన్ నూనె, పొద్దు తిరుగుడు పువ్వు నూనె వంటి వాటిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలి. వీటితో పాటు కమలాపండు, నిమ్మ, కివి, సాల్మన్, సీఫుడ్, బ్రోకలీ, ఆకుకూరలు, గ్రీన్ టీలు యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి.

బయోటిన్..

జుట్టు పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషించే మరో విటమిన్ బయోటిన్ లేదా విటమిన్ బి7. దీని లోపం వల్ల జుట్టు అతుకులతుకులుగా రాలుతుంటుంది. దీని నివారణకు బయోటిన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్డు పచ్చసొన, నట్స్, విత్తనాలు, అవోకాడో బయోటిన్ ను పుష్కలంగా కలిగి ఉంటాయి. 

ఐరన్ లోపం..

ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఐరన్ లోపం నివారణకు మాంసం, పప్పు ధాన్యాలు, కాయలు, త్రుణధాన్యాలు, పచ్చి ఆకు కూరలు వంటి ఆహారాన్ని తీసుకోవాలి. 

జింక్ మరియు సెలీనియం..

జుట్టు ఆరోగ్యానికి ముఖ్య ఖనిజాలు సెలీనియం, జింక్. జుట్టును ఆక్సీకరుణ నష్టం నుంచి రక్షించడం ద్వారా సెలీనియం పనిచేస్తుంది. సీఫుడ్స్, పౌల్ట్రీ, గుడ్లు మరియు చిక్కుళ్లు సెలీనియం యొక్క గొప్ప వనరులు.

జింక్ లోపంతో జుట్టు పెళసుగా తయారవుతుంద. దీని వల్ల జుట్టు దెబ్బ తినడం, రాలిపోవడం మరియు చిట్లడం వంటి అవకాశాలు ఉంటాయి. దీనిని నివారించడానికి ఓయిస్టర్లుర బీన్స్, కాలేయం, పాలు మరియు పాల ఉత్పత్తులు ఆహారంలో చేర్చుకోవాలి. 

ఒత్తిడిని తగ్గించుకోవడం..

జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఒత్తిడి. ఒత్తిడి వల్ల తలపై జుట్టు సగం నుంచి మూడు వంతులు రాలిపోవచ్చు. సాధారణంగా ఇది అధిక ఒత్తిడి ఉన్న సమయాలలో సంభవిస్తుంది.

దీర్ఘకాాలిక ఒత్తిడి మరియు ఆందోళన జుట్టు పలుచపడటానికి దారితీస్తుంది. ఒత్తిడిని తగ్గించడం ద్వారా జుట్టు రాలడాన్ని నియంత్రించవచ్చు. దీని కోసం యోగా, ధ్యానం క్రమం తప్పకుండా చేయాలి. శరీరానికి తగిన విశ్రాంతినివ్వాాలి. నడక, సైక్లింగ్ లేదా జాగింగ్ వంటి సాధారణ చర్యల వల్ల కూడా ఒత్తిడిని తగ్గించవచ్చు. 

Leave a Comment