కన్నీళ్లు పెట్టిస్తున్న ఓ చిన్నారి లేఖ..!

కరోనా ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిందే.. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఎంతో మంది జీవితాల్లో విషాదాన్ని నింపింది. ఎంతో మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో తండ్రిని కోల్పోయిన ఓ చిన్నారి తన గుండెలోని బాధను లేఖ రూపంలో చెప్పింది. తెలంగాణలో పాఠశాలలకు సెలవులు ఇస్తున్న క్రమంలో తన కన్నీటి గాథకు అక్షర రూపం ఇచ్చింది..

‘ఈ కరోనా వల్ల ఎంతో మంది చనిపోయారు. మా నాన్నకు కూడా కరోనా వచ్చింది. ఈ విషయం తెలిసిం మమ్మల్ని ఎవరు దుకాణాలకు రానియలేదు. ఎన్ని హాస్పిటళ్లు తిరిగినా.. మానాన్నను ఎవరూ తీసుకోలేదు. హైద్రాబాద్ లో ఒక రూమ్ కాలిగా ఉండటంతో.. మానాన్న హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. తర్వాత మానాన్న నాకు ఫోన్ చేసి ఊపిరి ఆడటం లేదు. బయట నిలబెట్టారు అని చెప్పాడు. కొద్ది సేపటికే ప్రాణం పోయింది’.. అంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడా ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న సుధా మాధురి తన స్నేహితురాలికి లేఖ రాసింది. కరోనా సమయంలో ఆ చిన్నారి అనుభవించిన మనోవేదనను లేఖలో రాసింది. 

Leave a Comment