బాలిక స్నానం చేస్తుంటే.. వీడియో తీసిన గ్రామ వాలంటీర్ భర్త..!

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై వార్డు వాలంటీర్ భర్త లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇంటర్ చదువుతున్న బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీసి వేధిస్తున్నాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు తిరువూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 తనను వేధించిన వాలంటీర్ భర్తకు శిక్ష పడాల్సిందేనని ఆ బాలిక డిమాండ్ చేస్తోంది.. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కొందరు రాజీ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అయితే బాలిక తల్లిదండ్రులు మాత్రం వాలంటీర్ కి శిక్ష పడాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. 

ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో ఓ వాలంటీర్ బాలికపై అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే..గ్రామ వాలంటీర్ గా పనిచేస్తూ ఇళ్లకు వెళ్తున్న క్రమంలో ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్న యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  సంక్షేమ పథకాలంటూ ఇంటింటికి తిరిగే వాలంటీర్లు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుండటంతో మహిళలు, బాలికలు ఆందోళనకు గురవుతున్నారు. ఈరోజుల్లో ఎవరినీ నమ్మే పరిస్థితి లేదంటున్నారు.

అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో గ్రామ వాలంటీర్ గా మహిళల ఉంటే.. విధులు మాత్రం ఆమె భర్త నిర్వహిస్తున్నారు. ఇలా చేసే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఇలాంటి వారి వల్ల అప్రతిష్టపాలు అవుతోంది.. రాష్ట్రంలో ఇలాంటి సంఘటలు జరగకుండా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలి. 

Leave a Comment