అదృష్టం తలుపు తట్టింది.. ఆ చేపతో ఆమె జీవితం మారిపోయింది..!

అదృష్టం ఏరూపంలో వస్తుందో చెప్పలేం.. చేపలు అమ్మే ఆ ముసలావిడకు మాత్రం చేప రూపంలో అదృష్టం తలుపు తట్టింది. దీంతో రాత్రికి రాత్రే ఆమె లక్షాధికారి అయిపోయింది. పశ్చిమ బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలోని సుందర్ బస్ అడువుల సమీపంలో ఉన్న సాగర్ దీవుల్లో పుష్పకర్ అనే వృద్ధురాలు జీవిస్తోంది. ఆమె సుందర్ బన్ నదిలో చేపలు పట్టుకుని అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుంటుంది. 

ప్రతి రోజూలాగే ఆమె చేపల వేటకు వెళ్లగా శనివారం నదిలో ఓ భారీ చేప తేలుతూ కనిపించింది. వెంటనే నదిలో దూకింది..తన శక్తినంతా కూడగట్టి చేపను ఒడ్డుకు లాగింది. ఆ చేపను తూకం వేయగా దాదాపు 52 కేజీలు ఉంది. వెంటన ఆ చేపను విక్రయించేందుకు మార్కెట్ కు తీసుకెళ్లింది. ఆ చేప అరుదైన భోలా ఫిష్ కావడంతో దానికి డిమాండ్ బాగా పెరిగింది. 

చేపల మార్కెట్ లో ఆ చేప రూ.3 లక్షలకు అమ్ముడపోయింది. దీంతో అప్పులతో ఇబ్బందులు పడుతున్న వృద్ధురాలికి రూ.3 లక్షలు రావడంపై సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఆ చేప చనిపోవడంతో కుళ్లిపోయింది. అయినా ఆ చేప లక్షల్లో ఎందుకు అమ్ముడుపోయిందంటే.. ఆ చేపను ఔషధాల్లో ఉపయోగిస్తారు. దాని తోలుకు కూడా మంచి డిమాండ్ ఉంది. కేవలం తోలు కిలో రూ.80 వేలు ఉంటుంది. ఈ చేప మార్కెట్లో రూ.40 లక్షలకు పైగా పలుకుతుందని వ్యాపారులు చెబుతున్నారు. 

Leave a Comment