సోనుసూద్ కు ‘స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డు‘ ఇచ్చిన ఐరాసా..

బాలీవుడ్ నటుడు సోనుసూద్ సినిమా లైఫ్ లో విలన్.. కానీ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అయిపోయాడు..లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులను తమ సొంత గ్రామాలకు పంపించాడు. తర్వత కూడా ఎవరైన ఆపదలో ఉన్నారని తెలిస్తే నేనున్నానని ఆదుకున్నాడు. ఇలా అనేక మందిని ఆదుకుని ప్రజల గుండెల్లో హీరోగా నిలిచిపోయాడు. ఆయన చేస్తున్న సేవలకు సోషల్ మీడియాలో ఎంతో మంది ప్రశంసించారు. 

కాగా సోనుసూద్ చేస్తున్న సామాజిక సేవను ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(యూఎన్డీపీ) గుర్తించింది. సోనుసూద్ కు ‘స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో సత్కరించింది. ఆ అవార్డును ఆన్ లైన్ ద్వారా సోనుసూద్ కి ప్రదానం చేసింది. 

Leave a Comment