బాబ్రీ మసీదు కూల్చివేత కేసు.. నిందితులందరూ నిర్దోషులే..

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మసీదు కూల్చివేత పథకం ప్రకారం జరగలేదని, ప్రథకం ప్రకారం కూల్చివేసినట్లు సరైన ఆధారాలు లేవని వెల్లడించింది. లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానంలోని కోర్టు రూమ్ నంబర్ 18లో సీబీఐ జడ్జి సురేంద్ర కుమార్ యాద్ తుది తీర్పు చదవి వినిపించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 2 వేల పేజీల జడ్జిమెంట్ కాపీని రూపొందించారు. ఈకేసులో నిందితులుగా అభియోగాలు మోపబడిన 49 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే 49 మందిలో 17 మంది మరణించారు. దీంతో మిగితా వారిని కోర్టు విచారణ చేసింది. 

ఈ కేసులో ప్రధాన నిందుతులుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఎల్ కే అద్వాణీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, సతీష్ ప్రధాన్, గోపాల్ దాస్ కోర్టుకు హాజరుకాలేదు. వీరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు. కరోనా కారణంగా ఉమా భారతి కూడా రాలేకపోయారు. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న వినయ్ కతియార్, సాక్షిమహారాజ్, ధరమ్ దాస్, రామ్ విలాస్ వేదాంతి, లల్లూ సింగ్, పవన్ పాండ్యా కోర్టుకు హాజరయ్యారు. 

 

Leave a Comment