ఆచార్యలో ‘సిద్ధ’గా రామ్ చరణ్..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అటర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నిటిస్తున్న సంగతి తెలసిందే..తాజాగా రామ్ చరణ్ పాత్రకు సంబంధించి ఓ అప్ డేట్ ను దర్శకుడు రిలీజ్ చేశారు. 

సోషల్ మీడియాలో రామ్ చరణ్ పాత్రను పరిచయం చేశాడు దర్శకుడు కొరటాల శివ. సినిమా సెట్ లోకి రామచరణ్ ను స్వాగతం పలుకుతూ ‘మా సిద్ధ సర్వం సిద్ధం’ అంటూ ట్వీట్ చేశారు. ఇందులో రామ్ చరణ్ చెవికి రింగు, మెడలో రుద్రాక్షతో ఆలయం కోసం ఏర్పాటు చేసిన సెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు కనిపించాడు. ప్రస్తుతం ఈ లుక్ వైరల్ అవుతోంది. 

Leave a Comment