అద్భుతం..మహానదిలో బయల్పడిన 500 ఏళ్ల పురాతన ఆలయం

ఒడిషాలో అద్భుతం జరిగింది. 500 ఏళ్ల పురాతన ఆలయం బయల్పడింది.  మహానదిలో చాలా ఏళ్ల క్రితం ముగిగిపోయిన ఒక పురాతన ఆలయం ఒడిషాలోని నాయగర్ జిల్లాలో తిరిగి కనిపించింది. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ ఆండ్ కల్చరర్ హెరిటేజ్ యొక్క పురావస్తు సర్వే గ్రూపు ఇటీవల కటక్ నుంచి మహానది తీరంలో ముగినిపోయిన పురాతన ఆలయాన్ని కొనుగొంది. 

ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ ఆండ్ కల్చరర్ హెరిటేజ్ కు చెందిన ప్రాజెక్టు అసిస్టెంట్ దీపక్ కుమార్ ఆలయాన్ని కనుగొనడంలో ఎన్నో సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ సారి ప్రయత్నంలో ఆయన విజయవంతం అయ్యారు. 

కటక్ సమీపంలోని పద్మావతి ప్రాంతంలో బైదేశ్వర్ వద్ద నది మధ్యలో ఈ గుడిపై భాగాన్ని కొనుగొన్నట్లు ఆయన తెలిపారు. 60 అడుగుల ఎత్తు ఉన్న ఈ పురాతన ఆలయం యొక్క నిర్మాణ శైలీ, నిర్మాణంలో వాడిన మెటీరియల్ ను బట్టి చూస్తే 15వ లేదా 16 శతాబ్దానికి చెందినగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విష్ణువు యొక్క రూపమైన గోపీనాథునికి చెందినదిగా భావిస్తున్నట్లు చెప్పారు. 

ఈ ఆలయం కనుగొన్న ప్రాంతాన్ని ‘సతపటన’గా పరిగణిస్తారని, పద్మావితి గ్రామం ఏడు గ్రామాల కలయిక అయిన సతపటనంలో ఒక భాగమని అన్నారు. 150 సంవత్సరాల క్రితం వరదల కారణంగా గ్రామం మునిగిపోయిందన్నారు. 

ఈ ప్రాంతంలో సుమారు 22 దేవాలయాలు నీటిలో మునిగాయని, అయితే గోపీనాథ్ ఆలయం శిఖరం మాత్రమే కొన్నేళ్ల పాటు కనిపించిందని పద్మావతి గ్రమాస్థులు చెబుతున్నారు. 11 సంవత్సరాల తర్వాత ఈ ఆలయం కనిపించినట్లు చెప్పారు.

Leave a Comment