పక్కా ఆధారాలతోనే అరెస్టు చేశాం : ఏసీబీ జేడీ

ఈఎస్ఐ స్కాంలో ఆధారాలు ఉన్నాయి కాబట్టే అచ్చెన్నాయడును అరెస్టు చేశామని ఏసీబీ జేడీ రవికుమార్ తెలిపారు. ఈ ఏస్ ఐ స్కాం పై శనివారం ఆయన మాట్లాడారు. ఈ ఏస్ ఐ స్కాంకు సంబంధించి ఇప్పటి వరకు  రెండు FIR లు నమోదు చేశామన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు డైరెక్టర్లు విజయ్ కుమార్, రమేష్ కుమార్, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, జేడీ జనార్దన్, ఉద్యోగులు చక్రవర్తి, వెంకట్రావు, రమేష్ బాబు అరెస్ట్ చేశామని తెలిపారు. 

ESI నిధుల కేటాయింపులో 2018-19కి సంబంధించి రూ.988 కోట్లలో రూ.150 కోట్లు అవినీతి గుర్తించామన్నారు. ల్యాబ్ కిట్ల కొనుగోలు, సర్జికల్, ఆఫీస్ ఫర్నిచర్, ఈసీజీ కొనుగోలు లో అక్రమాలు జరిగాయన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు19 మంది ముద్దాయిలను గుర్తించామని తెలిపారు. మరింత మందిని విచారణ చేయబోతున్నామన్నారు. డాక్యుమెంట్స్ పరిశీలన చేయాల్సి ఉందన్నారు. 

టెలీ హెల్త్ లో ఈసీజీ కి రూ.200 బదులు రూ.480 వసూలు చేశారని, కాల్ సెంటర్ సర్వీసులు వాడుకున్న వారికి 1.80 బదులు ఎక్కువగా వసూలు చేశారుని తెలిపారు. అచ్చెన్నాయుడు, రమేష్ కుమార్ తరపున హౌస్ మోషన్ పిటిషన్లు వేశారన్నారు. ఈ కేసులు ఇతర రాజకీయ నాయకుల పాత్ర ఇంత వరకు గుర్తించలేదని, ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. 

అవసరం లేకపోయినా, నాణ్యత లేని పరికరాలు మందులు కొన్నట్లు గుర్తించామని వెల్లడించారు. అచ్చెన్నాయుడు లెటర్ ప్యాడ్ ద్వారా  అర్దర్లు ఇవ్వాలని ఆదేశించారన్నారు. కొనుగోళ్ళకు సంబంధించి ఒకటి, టెలీ మెడిసిన్ కి సంబంధించి విడి విడిగా రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని తెలిపారు. ఈ రెండు కేసుల్లో ఏ1గా రమేష్ కుమార్, ఏ2గా అచ్చెన్నాయుడు ఉన్నారని తెలిపారు.  ఆధారాలు ఉన్నాయి కాబట్టే అచ్చెన్నాయుడ్ని విచారణకు రావాలని కోరలేదని,ఆధారాలు సేకరించామని, అవకతవకలు చేసినట్టు గుర్తించాం కాబట్టే అరెస్ట్ చేశామని వెల్లడించారు. 

Leave a Comment