మందు బాబుకు ఏపీ ప్రభుత్వం షాక్

మద్యం ధరలు 50 శాతం పెంపు

మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం మరో సారి షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం నియంత్రణకు ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంది. మంగళవారం నుంచి మద్యం ధరలను మరోె 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిన్నటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మద్యం ధరలను భారీగా పెంచింది. 

ఇటీవల ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను 25 శాతం పెంచింది. ఇప్పుడున్న ధరలపై మరో 50 శాతం ధరలను పెంచింది. దీంతో మొత్తంగా మద్యం ధరలు ఎంఆర్పీపై 75 శాతం ఎక్కువ వసూలు చేయనుంది.  ఈ ధరలు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయి. అలాగే ఈ నెలాఖరులోగా మరో 15 శాతం మద్యం దుకాణాలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ఒక్కరోజే రూ.60 కోట్ల మద్యం అమ్మకాలు..

లాక్ డౌన్ లో రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలపై మినహాయింపులను ఇచ్చింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్య విక్రయాలను ప్రభుత్వం ప్రారంభించింది. 40 రోజుల లాక్ డౌన్ తర్వాత మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చిర రోజునే మద్యం అమ్మకాలు రూ.60 కోట్ల వరకు జరిగాయి. అయితే ఏపీలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

 

Leave a Comment