ఆరోగ్య కార్మికులకు రూ.50లక్షల బీమా..

కరోనా వైరస్ కు వ్యతిరేకంగా 22 లక్షల మంది ఆరోగ్య కార్మికులకు రూ.50 లక్షల బీమా రక్షణ కల్పిచేందుకు న్యూ ఇండియా అస్యూరెన్స్ సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆరోగ్య కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తమని ఆర్థికి మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కొన్ని రోజులకు ప్రభుత్వ యాజమాన్యంలోని న్యూ ఇండియా అస్యూరెన్స్ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. 

మార్చి 26ప ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినట్లుగా న్యూ ఇండియా అస్యూరెన్స్ దేశవ్యాప్తంగా 22.12లక్షల ఆరోగ్య సంరక్షణ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.50లక్షల బీమా కవరేజీని అందించడానికి వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ట్విట్ లో తెలిపింది. 

ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింది భారతదేశం అంతటా కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు కరోనా వైరస్ వల్ల ప్రమాదవశాత్తు ప్రాణనష్టం జరిగితే వారికి ఈ బీమా సౌకర్యం వర్తిస్తుంది. రూ.50 లక్షల బీమా మార్చి 30 నుంచి 90 రోజుల వ్యవధిలో చెల్లుతుంది. 

Leave a Comment