సుకన్య సమృద్ధి యోజన..మీ అమ్మాయి భవిష్యత్తుకు భరోసా..

 Sukanya Samriddhi Yojana అనేది మీ కుటుంబంలోని ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉత్తమ పెట్టుబడి పథకం. ఈ పథకం ఆడపిల్లల భవిష్యత్ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో సెక్షన్ 80 కింద ఆదాయపు పన్ను ప్రయోజనానాలను పొందవచ్చు.

ఈ పథకంలో 10 ఏళ్లలోపు ఉన్న ఇద్దరు కూతుర్ల పేరుపై Sukanya Samriddhi  అకౌంట్ ను ప్రారంభించవ్చు. మీ కూతురు 21 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ పథకం నుంచి మొత్తం డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాత 50 శాతం డబ్బులు వెనక్కు తీసుకునే అవకాశం ఉంది. 

ఇది ఎలా పనిచేస్తుంది?

ఈ పథకంలో ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరూ 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టవచ్చు. మీకు పాప పుట్టిన వెంటనే కూడా Sukanya Samriddhi పథకాన్ని ప్రారంభించవచ్చు. ఇందులో తండ్రి సంవత్సరంలో రూ.1.5 లక్షలు మరియు తల్లి రూ.1.5 లక్షలు పెట్టబడి పెడితే రూ.3 లక్షల గ్రాండ్ మొత్తానికి పెట్టుబడి పెట్టవచ్చు. 

Sukanya Samriddhi Yojana పథకం వడ్డీ రేటు ఎంత?

Sukanya Samriddhi Yojana పథకంలో వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ప్రస్తుతం ఏప్రిల్ – జూన్ 2020 త్రైమాసికంలో వడ్డీ రేటు 7.6 శాతం ఉంది. ఈ పథకంపై వడ్డీ రేటును ప్రభుత్వం ప్రకటిస్తుంది. 

Sukanya Samriddhi Yojana ఖాతును ఎలా తెరవాలి?

భారత దేశంలో పని చేసే ఏ బ్యాంకులోనైనా లేదా పోస్టాఫీస్ లో Sukanya Samriddhi Yojana ఖాతాను తెరవవచ్చు. ప్రస్తుతం సుకన్య పథకం సంవత్సారానికి 7.6 శాతం వడ్డీ పొందుతుంది. ఇది పీపీఎఫ్, ఎన్పీఎస్ వంటి ఇతర పథకాల కంటే చాలా ఎక్కువ. 

ఈ పథకంలో ఖాతాను అమ్మాయి పుట్టినప్పటి నుంచి 10 ఏళ్లలోపు తెరవవచ్చు. నెలకు రూ.1000 నుంచి గరిష్టంగా 12,500 వరకు అకౌంట్ లో డిపాజిట్ చేయవచ్చు. అప్పుడు మెచ్యూరుిటీ తర్వాత రూ.6 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు పొందవచ్చు. ఖాతా తెరిచిన దగ్గరి నుంచి 15 ఏళ్లు అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చేయాలి.  

Sukanya Samriddhi Yojana దరఖాస్తు ఫారం నింపడం ఎలా?

Sukanya Samriddhi Yojana దరఖాస్తు ఫారంలో మీ అమ్మాయి గురించి కొన్ని కీలక డేటాను అందించాలి. ఆమె తరపున డిపాజిట్లు చేసే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వివరాలు కూడా అవసరం. దరఖాస్తు ఫారంలో కనిపించే కొన్ని కీలక ఫీల్డ్ లు కింద ఉన్నాయి. 

  • అమ్మాయి పేరు(ప్రాథమిక ఖాతా హోల్డర్)
  • తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పేరు(జాయింట్ హోల్డర్)
  • ప్రారంభ డిపాజిట్ మొత్తం
  • చెక్ లేదా డీడీ సంఖ్య మరియు తేదీ(ప్రారంభ డిపాజిట్ కోసం ఉపయోగిస్తారు)
  • ఆడపిల్ల పుట్టిన తేదీ
  • ప్రాథమిక ఖాతాదారుడి జనన ధ్రువీకరణ వివరాలు
  • తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఐడీ వివరాలు(డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్)
  • ప్రస్తుత మరియు శాశ్వత చిరునామా
  • ఏదైనా ఇతర కెవైసీ పత్రాల వివరాలు(పాన్, ఓటర్ ఐడీ కార్డు)

పై వివరాలు దరఖాస్తులో నింపిన తర్వాత, ఫారంలో సంతకం చేసి, అన్ని పత్రాల కాపీలతో పాటు ఖాతా ఓపెనింగ్ అథారిటీ(పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ బ్రాంచి) లో సమర్పించాలి.

Sukanya Samriddhi Yojana ముఖ్యమైన ఫీచర్స్..

  • ఒక Sukanya Samriddhi Yojana ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 డిపాజిట్ కూడా చేయలేకపోతే వారి ఖాతా ‘డిపాల్డ్ ఖాతా’ అని పిలుస్తారు. మెచ్యూరిటీ తేదీ వరకు ఈ డిఫాల్డ్ ఖాతా పథకంలో వర్తించే విధంగా వడ్డీ రేటును పొందుతుంది.
  • అమ్మాయి మరణం విషయంలో లేదా కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే Sukanya Samriddhi Yojana ఖాతాను మూసివేసేందుకు ప్రాసెస్ చేయబడుతుంది. అమ్మాయికి ఏదైనా ప్రాణాంతక వ్యాధికి చికిత్స విషయంలో లేదా సంరక్షకుడి మరణంతో ఖాతాను మూసివేసేందుకు అనుమతి ఉంది. 
  • ఒక అమ్మాయి 18 సంవత్సరాలు నిండిన తర్వాత తను సొంతంగా ఖాతాను నిర్వహించుకోవచ్చు. ఆమెకు 18 ఏళ్లు నిండిన తర్వాత, ఖాతా ఉన్న పోస్టాఫీస్ లేదా బ్యాంకుకు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన తరువాత ఆమె Sukanya Samriddhi Yojana నిర్వహించడానికి అర్హులు.  

Leave a Comment