వినాయక చవితి ఉత్సవాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

వినాయక చవితి ఉత్సవాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గణేష్ ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ ను బుధవారం విచారించింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. 

హైకోర్టు ఆదేశాలు:

  • ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు. 
  • కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలి. 
  • పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని ఉత్సవాలు నిర్వహించకూడదు. 
  • ఉత్సవాల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. 

Leave a Comment