పురుషుల కోసం.. 3 సూపర్ డ్రైఫ్రూట్స్..!

లైంగిక కలయిక అనేది ఓ మధురమైన అనుభూతి.. ఈ బిజీ లైఫ్ లో పురుషులు తమ జీవిత భాగస్వామికి ఈ అనుభూతిని అందించలేకపోతున్నారు. సంతోషకరమైన జీవితం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.. కొంత మంది పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటంతో తండ్రి కాలేకపోతున్నారు..  ఇలాంటి వారు వెంటనే నిపుణులను సంప్రదించాలి.. అయితే స్పెర్మ్ కౌంట్ పెంచడం కోసం మూడు డ్రైఫ్రూట్స్ అద్భుతంగా పనిచేస్తాయి.. వాటి గురించి తెలుసుకుందాం..

1.ఎండుద్రాక్ష:

 ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండలో ఎండబెట్టడం వల్ల వీటిలో ఎలక్ట్రోలైట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఎనర్జీ, విటమిన్లు ఉంటాయి. అంతేకాదు విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. అయితే డయాబెటిక్ రోగులు మాత్రం పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.

2.అత్తి పండ్లు:

అత్తిపండ్లని డ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకోవడం వల్ల పురుషుల సంతానోత్పత్తి మెరుగుపడుతుంది. స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా పాంతోతేనిక్ యాసిడ్, కాపర్, ఫైబర్, విటమిన్ B6 ఉంటాయి. చాలామంది అత్తి పండ్లను చిరుతిండిగా తింటారు. ఇలా చేయడం ద్వారా వీటి ప్రభావం కొన్ని రోజుల్లో తెలుస్తుంది.

3.ఖర్జూరాలు:

ఖర్జూరాలను ఎన్నో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది శుక్రకణాల సంఖ్య, నాణ్యతను పెంచుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. వాస్తవానికి ఎస్ట్రాడియోల్, ఫ్లేవనాయిడ్స్ అనే 3 ముఖ్యమైన సమ్మేళనాలు ఖర్జూరాలలో ఉంటాయి. ఇవి పురుషుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది పురుషుల లైంగిక కోరిక, శక్తిని మరింత మెరుగుపరుస్తుంది.

 

 

Leave a Comment